Home Entertainment రివ్యూ: స్వయంవద

రివ్యూ: స్వయంవద

1075
0
ఆత్మాభిమానం గల ఓ యువతి తనకు జరిగిన అవమానానికి తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘స్వయంవద’. అనికా రావు, ఆదిత్య అల్లూరి జంటగా వివేక్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. లక్ష్మీ చలనచిత్ర పతాకంపై రాజా దూర్వాసుల నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ  సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్ట్ లో తెలుసుకుందాం.
కథ:
తాను అనుకున్నది జరగాలని, ప్రతి ఒక్కరూ తనకు నచ్చినట్లు ఉండాలని కోరుకునే యువతి స్వయంవద (అనికారావు). ఆమెను తండ్రి విక్రమ్ రెడ్డి (లోహిత్ కుమార్) అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. తనకు ఏమాత్రం కోపం తెప్పించినా, వెకిలి వేషాలు వేసినా సహించదు స్వయంవద. వాళ్లకు అప్పటికప్పుడు బుద్ధి చెబుతుంటుంది. స్వయంవద తండ్రి విక్రమ్ రెడ్డి దగ్గర బినామీగా పనిచేస్తుంటాడు జెల్లా వెంకట్రాముడు (పోసాని కృష్ణ మురళి). ఇతని కొడుకు సుబ్బు (సుబ్బారావు ) (ఆదిత్య అల్లూరి) సినిమా హీరో అవుదామని ప్రయత్నిస్తుంటాడు. ఇది ఇంట్లో వాళ్లకు నచ్చదు. ఈ క్రమంలో స్వయంవద సుబ్బును చూసి ఇష్టపడుతుంది. తండ్రికి చెబితే వెంకట్రాముడుతో మాట్లాడి సంబంధం కుదర్చుకుంటాడు. అందరికీ పెళ్లి ఇష్టమైనా స్వయంవద అహం సుబ్బుకు నచ్చదు. దాంతో పెళ్లి వద్దని చెబుతాడు. తనకు ఏమాత్రం నచ్చని చిన్న విషయాలకే మండిపడే స్వయంవద…తనను పెళ్లికి నిరాకరిస్తే ఎలా స్పందించింది. ద్వితీయార్థంలో వచ్చే ప్రియంవద ఎవరు ఆమెకు, స్వయంవద కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటనేది మిగిలిన కథాంశం.
గగుర్పొడిచేలా..
ప్రతికూల ఆలోచనలు మనిషిని ఎంతలా పతనం చేస్తాయో ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు వివేక్ వర్మ. తనకు తొలి చిత్రమైనా ఆద్యంత ఆకట్టుకునేలా తెరకెక్కించారు. మొదటి సన్నివేశాన్నే అద్భుతంగా తెరకెక్కించి గగుర్పొడిచేలా చేశాడు. సినిమా చూసిన వాళ్లు ఈ ఫస్ట్ సీన్ మర్చిపోలేరు. హారర్ సప్సెన్స్ అంశాలను వినోదం ఎక్కడా తగ్గకుండా రూపకల్పన చేశారు. ఒక వైపు నవ్విస్తూనే ఆలోచింపజేసేలా మంచి సందేశాన్నిచ్చారు. ఒకానొక చారిత్రక నేపథ్యాన్ని ఇప్పటి వర్తమానానికి ముడివేస్తూ చక్కటి కథను అల్లుకున్నాడు. నెగిటివ్ థింకింక్ ఎంత ప్రమాదకరమో తెలియజెప్పాడు. దర్శకుడిగా స్వయంవద  వివేక్ వర్మకు మంచి పేరు తీసుకురావడం ఖాయం. ఇక స్వయంవద పాత్రలో అహంభావిగా అనికారావు సహజంగా నటించింది. భయానక సన్నివేశాల్లో ఆమె చూపించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ప్రియంవద పాత్రలో పూర్తి భిన్నమైన స్వభావంతో నటించి మెప్పించింది. ఆదిత్య అల్లూరి తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు. ప్రతికూల ఆలోచనలు గల తండ్రిగా లోహిత్ కుమార్ ఆకట్టుకుంటే…కొడుకు కోసం తపించే తండ్రిగా పోసాని నటన రక్తి కట్టించింది. ఆద్యంతం సాగే మూడు పాత్రల్లో ధన్ రాజ్ తన పూర్తిస్థాయి నటన చూపించారు. వేణు ముర‌ళీధ‌ర్.వి కెమెరా పనితనం సినిమాకు హుందాతనం తీసుకురాగా….ర‌మ‌ణ‌.జీవి పాటలు, నేపథ్య సంగీతం వినసొంపుగా సాగాయి. సెల్వ కుమార్ ఎడిటింగ్ పనితనం కనిపించింది.
రొటీన్ కు భిన్నంగా..
హారర్ చిత్రాలంటే ఒక ఫామ్ హౌస్, అమ్మాయికి దెయ్యం పట్టడం, నేపథ్యంగా దానికో కారణం ఉండటం ఇవీ ఇప్పటిదాకా మనం చూస్తున్న సగటు తెలుగు, తమిళ హారర్ చిత్రాలు. కానీ స్వయంవద ఇందుకు కొత్తగా సాగుతూ రొటీన్ కు భిన్నమైన అనుభూతిని అందిస్తుంది. చారిత్రక నేపథ్యంతో సాగడ, నెగిటివ్ థింకింగ్ వద్దని చెబుతూ సందేశాత్మకంగా, వినోదాత్మకంగా సరికొత్త చిత్రంగా అలరిస్తుంది. ఈ చిత్రం ఇంతలా ఆకట్టుకుంటుందంటే కారణం దర్శకుడి ప్రతిభే. మొత్తానికి అంద‌రికి న‌చ్చే సినిమా అనడంలో నో డౌట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here