వాషింగ్టన్ డీసీ:
అమెరికాలో ‘నక్షత్రం ప్రొడక్షన్స్’ నుంచి ‘కాక్‌టైల్ డైరీస్’ టైటిట్‌తో ఓ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. తాజాగా విడుదలైన వెబ్ సిరీస్ ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫిల్మ్ మేకర్ వేణు నక్షత్రం సమర్పణలో, అవంతిక నక్షత్రం నిర్మాణంలో సాయిరాం పల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ జూన్‌లో విడుదల కాబోతోంది.
‘అమెరికాలో మనం..’ అంటూ నక్షత్రం ప్రొడక్షన్స్ నుంచి తొలిసారిగా ‘కాక్‌టైల్ డైరీస్’ వెబ్ సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్టు వేణు నక్షత్రం తెలిపారు. రీఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో తమ టీమ్ అంతా సంతోషంగా ఉందన్నారు. ఇందులోని నటీనటులు అంతా ఎన్నారైలు అయినప్పటికీ ఎంతో పర్‌ఫెక్టుగా నటిస్తున్నాని తెలిపారు. ఈ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతా తెలుగు ఎన్నారైలతోనే ఈ వెబ్ సిరీస్‌ను ఆసక్తిరంగా తెరకెక్కిస్తున్నట్టు నిర్మాత అవంతిక నక్షత్రం తెలిపారు. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలోనే ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్టుగా చెప్పారు.