ఇండియాలో విడుదలైన ‘కాక్‌టైల్ డైరీస్’ వెబ్ సిరీస్
◆ అమెజాన్ ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న ‘కాక్‌టైల్ డైరీస్’
◆ ఇండియాలో iQlik యూట్యూబ్‌లో విడుదల
◆ వైరల్‌గా మారిన ‘కాక్‌టైల్ డైరీస్’ వెబ్ సిరీస్
◆ నక్షత్రం ప్రొడక్షన్‌లో నిర్మాణం
◆ తొలిసారి తెలుగు ఎన్నారైల వెబ్‌సిరీస్
◆ సక్సెస్ సంబరాల్లో చిత్రయూనిట్
అమెరికాలో తెలుగు ఎన్నారైలు రూపొందించిన వెబ్ సిరీస్ ఇప్పుడు అక్కడ దుమ్మురేపుతోంది. ‘నక్షత్రం ప్రొడక్షన్స్’ నుంచి ‘కాక్‌టైల్ డైరీస్’ టైటిట్‌తో వెబ్‌సిరీస్ రూపొంది అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో విడులైంది. తాజాగా ఇండియాలో iQlik యూట్యూబ్ చానల్‌లో విడుదలైంది. అమెరికా మాదిరిగానే ఇండియన్స్ నుంచి కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ‘కాక్‌టైల్ డైరీస్’.
ఎంతెంతదూరం, పిలుపు, అవతలివైపు వంటి ఫిల్మ్స్ రూపొందించిన మూవీమేకర్ వేణు నక్షత్రం సమర్పణలో ‘కాక్‌టైల్ డైరీస్’ విడుదలైంది. అవంతిక నక్షత్రం నిర్మాణంలో సాయిరాం పల్లె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ గత నెలలో అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో విడుదలై అందరిని ఆకట్టుకుంటోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ 8 ఎపిసోడ్‌లు విడుదల చేసినట్టు సాయిరాం పల్లె తెలిపారు.
‘అమెరికాలో మనం..’ అంటూ నక్షత్రం ప్రొడక్షన్స్ నుంచి తొలిసారిగా ‘కాక్‌టైల్ డైరీస్’ వెబ్ సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించినట్టు వేణు నక్షత్రం తెలిపారు. గత ఆగస్టు 23న విడుదలైన ‘కాక్‌టైల్ డైరీస్’ వెబ్‌సిరీస్‌కు అద్భుతమైన స్పందన వస్తోందని, తమ యూనిట్ అంతా సక్సెస్ సంబరాలు జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఇందులోని నటీనటులు అంతా ఎన్నారైలు అయినప్పటికీ ఎంతో పర్‌ఫెక్టుగా నటించారని తెలిపారు.
అంతా తెలుగు ఎన్నారైలతో యూఏఎస్‌లోనే తొలిసారిగా తాము ఈ వెబ్‌సిరీస్ నిర్మించినట్టు నిర్మాత అవంతిక నక్షత్రం తెలిపారు. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలోనే ఈ వెబ్ సిరీస్ పూర్తి చేశామన్నారు. అమెజాన్‌లోని ఈ లింకులలో ఈ వెబ్‌సిరీస్ వీక్షించవచ్చని నిర్మాత తెలిపారు.
https://www.amazon.com/dp/B07WKGL3L7
https://www.amazon.co.uk/dp/B07WN9VWS2
ప్రశాంత్ నమాతీర్థం సినిమాటోగ్రఫీ అందించగా, ప్రణీత్ మ్యూజిక్ సమకూర్చారు. జయంత్ ఆర్ చల్లా, ప్రభాకర్ రెడ్డి కొంబాలపల్లి ఆర్థిక సహాకారం అందించారు. అమెరికాలో అందరిని ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది ఈ ‘కాక్‌టైల్ డైరీస్’ వెబ్‌సిరీస్.