స్టార్ హీరోల సినిమాలే కాదు.. మంచి కథా బలమున్న సినిమాలకు ప్రాధాన్యమిచ్చే నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. చిన్న సినిమాలకు, కొత్త దర్శకులకు, యంగ్ టాలెంట్‌కు ఆయన అందించే సపోర్టే ఆయన్ని టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో నిలబెట్టింది. సక్సెస్ శాతం అధికంగా ఉంటూ తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్‌గా వెలిగిపోతున్నాడు. సొంత సినిమాల ద్వారా భారీగా లాభాలు వచ్చినా ఇతరులు నిర్మించిన సినిమాల డిస్ట్రిబ్యూషన్ కారణంగా పలుమార్లు నష్టపోయానని చెబుతూ ఉంటాడు ఆయన. హిట్ చిత్రాల నిర్మాతగా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దిల్‌రాజు ఎవ్వరికీ చెప్పొద్దు అనే ప్రేమకథా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.
భారీ బడ్జెట్ సినిమాల ప్రొడ్యూసర్ అయినప్పటికీ చిన్న సినిమాలను కూడా అండగా ఉంటాడు దిల్ రాజు. ఇటీవల పండగ సందర్భంగా ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమాని రిలీజ్ చేసాడు. దిల్ రాజు చేతిలో పడింది అంటే విషయం ఉన్నట్టే. నిజంగా ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమా టైటిల్ ని నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. వాళ్లు దాన్ని ప్రమోట్ కూడా చేయటం లేదని తెలుస్తోంది. చిన్న సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బాగా జనాల్లోకి వెళ్తుంది. మరి ఈ నిర్మాతలు బాద్యత అంతా దిల్ రాజు మీదే వేసినట్టు కనిపిస్తున్నారు.
నిజానికి ‘ఎవరికీ చెప్పొద్దు’ మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, హీరోగా నటించిన రాకేషే సినిమాని నిర్మించాడు. అయితే రాకేష్ వర్రే డబ్బుతోపాటు మనసు పెట్టి చేసిన, తీసిన సినిమా ఇది. కులం గురించి, కుల పిచ్చి గురించి హుందాగా చక్కని మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. అయితే సైరా ఎఫెక్టు వల్ల కలెక్షన్స్ సంగతి మాట్లడకున్నా హీరోకి, డైరెక్టర్ కి మంచి భవిష్యత్తు ఉంటుందనే చెప్పాలి. బాహుబలి, బద్రీనాథ్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన రాకేష్ కెరీర్ మరింతా ఊపందుకుంటుందనే చెప్పాలి.