ఏదో ఓ రూపంలో పాతకు పాతరేసే సరికొత్త మార్పు అనివార్యం. వ్యక్తులైనా వ్యవస్థలైనా తక్షణం తేల్చుకోవాల్సిన విషయమిది. పరిస్థితులకు అనుగునంగా మార్పు అవసరాన్ని గుర్తించాలి. అయితే లాభార్జనే ధ్యేయంగా పనిచేసే కొన్ని కంపెనీలు ఆ లాభాల వేటలో పడి సామాజిక బాధ్యతను విస్మరిస్తాయి. పూర్తిస్థాయి వ్యాపార సంస్థలుగా మారిపోయాక సామాజిక సేవ, బాధ్యతలను గాలికి వదిలేస్తాయి. అయితే కొన్ని సంస్థలు మాత్రం ప్రారంభం నుంచి వ్యాపార లక్ష్యాన్ని సాధిస్తూనే కీలకమైన సామాజిక బాధ్యతను మాత్రం మర్చిపోకుండా నెరవేరుస్తూ ఉంటాయి. అలాంటి సంస్థే నారాయణ.
కరోనా నేపధ్యంలో దేశం మొత్తం విధించిన లాక్‌డౌన్‌తో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదని నారాయణ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులకు శ్రీకారం చుట్టా యి. ఈ క్లాసుల ద్వారా టీచర్ చెప్పే పాఠ్యాంశాలను నేరుగా ఇంట్లోనే వినవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డైలీ అసైన్‌మెంట్లు కూడా ఇందులోనే ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచీల పరిధిలో అమలు చేస్తున్నారు. రోజుకు సగటున 10వేల మందికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులను వీక్షిస్తున్నారని, మొత్తంగా 75 వేల మందికి పైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందుతున్నారని నారాయణ విద్యాసంస్థలు ఒక ప్రకటనలో విడుదల చేశాయి. మొత్తానికి కరోనాకు ముందు కరోనా తర్వాత అనే తర్వాత చదువులు కొత్తగా మారిపోతున్నాయన్నమాట.