కరోనా నేపధ్యంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌లో కొనసాగుతోంది. విద్యార్థుల చదువులకు బ్రేక్ పడింది. ఇలాంటి సమయంలో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదని నారాయణ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులకు శ్రీకారం చుట్టాయి. ఈ క్లాసుల ద్వారా టీచర్ చెప్పే పాఠ్యాంశాలను నేరుగా ఇంట్లోనే వినవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డైలీ అసైన్‌మెంట్లు కూడా ఇందులోనే ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ ఆన్‌లైన్ విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచీల పరిధిలో అమలు చేస్తున్నారు. రోజుకు సగటున పదివేల మందికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులను వీక్షిస్తున్నారని, మొత్తంగా 75 వేల మందికి పైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందుతున్నారని సమాచారం. వ్యాపార లక్ష్యాన్ని సాధిస్తూనే కీలకమైన సామాజిక బాధ్యతను మాత్రం మర్చిపోకుండా నెరవేరుస్తూ ఉన్న సంస్థల్లో నారాయణ ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇలాంటి కీలక సమయంలో కూడా పిల్లలు టీవీలకి అతుక్కుపోకుండా ఆన్‌లైన్ చదువులకు శ్రీకారం చుట్టడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.