ప్రపంచాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తోంది. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది ఆ మహమ్మారి. ముఖ్యంగా అమెరికా విలవిలలాడుతోంది. ఇలాంటి పరిస్థితులలో సెలబ్రెటీలంతా వీడియో సందేశాల ద్వారా ప్రజలకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిన్నారు. అందులో భాగంగా, అమెరికాలో ఉంటున్న వర్ధమాన గాయకుడు తెలుగు ఎన్నారై కార్తీక్ జయంతి తాజాగా కరోనాపై చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. రాధా జయంతి నిర్మించిన ఈ వీడియోలో అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థల తెలుగు వారు, వారి వారి సందేశాలతో ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నారు