టైమ్స్‌స్వేర్: తెలంగాణ ఎన్నారై, రచయిత నక్షత్రం వేణుగోపాల్ రాసిన ‘అరుగు’ కథల పుస్తకాన్ని తానా బంగారు బతుకమ్మ సందడిలో పరిచయం చేశారు. టైమ్స్‌స్వేర్ వద్ద జరిగిన బతుకమ్మ సందడి కార్యక్రమ వేదికపై తానా ముఖ్యులు ఈ పుస్తకాన్ని పరిచయం చేసి, రచయిత వేణు నక్షత్రంను అభినందించారు. తానా కార్యక్రమాల్లో పలువురు వేణు నక్షత్రం రాసిన కథలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. రచయితపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ జీవన నేపథ్యాన్ని ఆవిష్కరించిన ఈ కథల సంపుటి ఎన్నారైలకు హాట్ కేక్‌గా మారిపోయింది.